- అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : మంగళవారం గద్వాల పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయం హాల్ లో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ నేతన్న పొదుపు పథకంపై చేనేత కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. చేనేత కార్మికులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… చేనేత కార్మికులు ప్రతి నెల రూ. 2200 చొప్పున కడితే 52, 800 రూపాయలు అవుతుందని, రెండేళ్ల తర్వాత రూ.1,56,000 రూపాయలు వస్తాయని వివరించారు. నేను, కలెక్టర్ బ్యాక్ ల ద్వారా మాట్లాడి మహిళా కార్మికుకు రుణ సహాయం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గద్వాల చీరల బ్రాండ్ ను కాపాడాల్సిన బాధ్యత మీపై, నా పై ఉందని గుర్తు చేశారు. చేనేత కార్మికులు కూడా టెక్నాలజీ ద్వారా తమ కళా నైపుణ్యం పెంచుకొవాలని, అందుకు కావాల్సిన నా సహాయం ఎప్పుడూ ఉంతుందన్నారు. ఈ వృత్తిలో 11 రకాల మంది కార్మికులు పని చేస్తే వారంలో ఒక చీర తయారవుతుందని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటదని హామీ ఇచ్చారు. కార్మికులు ముఖ్యంగా చేనేత మగ్గాలకు జీయో ట్యాగ్ తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖ అధికారులు మరియు సంఘం నాయకులు ప్రత్యేక అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చేనేత కార్మికులు ఎమ్మెల్యే కి అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ ఏడివోలు రాజేశ్వర్ రెడ్డి, ప్రియాంక, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ మురళి, పావని గద్వాల చేనేత జరీ చీరలు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు అక్కల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మంత్రి సురేష్, కార్మిక సంఘం అధ్యక్షులు అక్కల శాంతారావు, చేనేత కార్మికులు నాయకులు సత్యనారాయణ, నాయకులు షుకూర్, గోవిందు, కురుమన్న, ధర్మ నాయుడు, సుదర్శన్, నాగేంద్ర యాదవ్, దౌలన్న, రామాంజినేయులు, విజయ్ , కొత్త గణేష్, బాలాజీ, శశా, వీరేష్, కార్మికులు తదితరులు ఉన్నారు.





