నేటి సాక్షి , మునగాల : మునగాల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ మేరకు గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను సేకరించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను 13వ తేదీ వరకు స్వీకరించి 13 వ తేదీనే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. 14 న సవరణ జాబితా పరిష్కరిస్తారు. 15 న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రచురిస్తారని అధికారులు తెలిపారు.





