- ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
- బాస్ స్వయంగా బరిలోనికి దిగాడు
- ఇసుక మాఫియా ఇంకా చుక్కలేనా
- అధికారులను సిబ్బందిని హెచ్చ రించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక న్
- ఇసుక మాఫియా సూత్రధారులు పాత్రధారులు పైరవీకారులు వారు ఏ రంగంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్న సరే జాబితా సిద్ధం చేయండి
- ఇన్ని రోజులు విలేకరులను భయభ్రాంతులకు గురి చేసిన ఇసుక మాఫియాదారు
- ఇప్పుడు ఎస్పీ సార్ రంగంలో దిగినారు ఇప్పుడు ఏం చేస్తారు
- అనుమతి లేకుండా పిరికేడు ఇసుక బయటకు పోవద్దు అలా సత్యం వహిస్తే అధికారులను వదిలేది లేదు

నేటి సాక్షి, నరసింహుల పేట రిపోర్టర్ భూక్య రవి : ఆఖరి సారిగా చెబుతున్నా మీరు అనండి ఇసుక ఆక్రమణను మానుకోండి ముండిగా ముందుకు పోతే అంటే చట్ట పరిధిలో మేమే మమ్మల్ని మారుస్తాం కఠినంగా శిక్షిస్తాం అని ఇసుక మాఫియాను ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ ఇసుకసురూలపై కఠినంగా వ్యవహారించాలని, కేసులు నమోదు చేసి కట్టుదిట్టం చేయాలనీ అధికారులను అదేశించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా పై పోలీసు శాఖ దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠిన మయిన సెక్షన్స్ కింద (PDPP ACT, MINES ACT) కేసులు పెట్టడం జరుగుతుంది అని అన్నారు. ఇసుక అక్రమ రవాణా, నిరోధించేందుకు 100 కు డయల్ చేసి పోలీసు వారికీ సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎవరైనా, ఎక్కడైనా ఇసుకను అక్రమంగా తరలించినా, అధిక ధరలకు విక్రయించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్ల భద్రత చర్యలు చేపట్టనున్నట్టు సూచించారు. పోలీసు వారి సూచనలకు విరుద్ధంగా ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్య అనుమతి పొందిన వారికి మాత్రమే రాష్ట్రంలో ఇసుక తరలించేందుకు, విక్రయించేందుకు అనుమతి ఉందన్నారు. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్స్ అని, ఇతర పేర్లతో ఎటువంటి లావాదేవీలు జరిపినా అటువంటి వారిపై క్రమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS హెచ్చరించారు.





