Thursday, March 19, 2026

జమ్మికుంట వారసంత పై మళ్లీ లొల్లి

  • రోడ్లపై కూరగాయల అమ్మకాలు
  • సమస్య పరిష్కరించకుంటే
  • మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తా
  • జమ్మికుంట సిపిఐ నాయకులు లింగంపల్లి అన్వేష్

నేటి సాక్షి, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రతి మంగళవారం వారసంత రోడ్లపై కూరగాయలు పెట్టడంతో ట్రాఫిక్ సమస్య తో వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారని లింగంపల్లి అన్వేష్ ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మికుంట పట్టణంలో మంగళవారం జరిగే వార సంతకు జమ్మికుంట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడ వేలాదిగ వస్తుంట్టారు. ఈ యొక్క వారసంత నడిరోడ్లపై,హాస్పిటల్స్, స్కూల్స్ మరియు పలువురి ఇంటీ ముందు నిర్వహించడం వలన తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ ద్విచక్రవాహనాలు రోడ్లపై పార్కింగ్ చేయడం రోడ్లపైనే కూరగాయలు అమ్మడం లాంటి వాటి వల్ల సామాన్య ప్రజలు చాల ఇబ్బందులకు గురి అవుతున్నారని మున్సిపల్ అధికారులకు పోలీసుసిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడే లేడు అని కనీసం ప్రాణాలు రక్షించే అంబులెన్సుకు కూడ దారి లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని పోలీస్ సిబ్బంది అయితే మంగళవారం డ్యూటీ లేదు అనేవిధంగా ప్రవర్తిస్తున్నారు. 100 కి కాల్ చేస్తేనే స్పందిస్తున్నారు కానీ అది కూడ కొంతసేపు ఉండి మళ్ళీ వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని లేనియెడల వచ్చేవారం మంగళవారం మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సిపిఐ జమ్మికుంట పట్టణ నాయకులు లింగంపెల్లి అన్వేష్ హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News