Thursday, March 19, 2026

జగిత్యాల జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభను విజయవంతం చేయండి

  • AITUC జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు

నేటిసాక్షి(కె. గంగాధర్ ) పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలో AITUC ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికుల కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఇరుగురాల భూమేశ్వర్ మాట్లాడుతూ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని కోరారు. సంక్షేమ బోర్డులో ఉన్న కోట్లాది రూపాయలు ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడకుండ కార్మికులకే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో కార్మికుల ఐక్యతను చాటుతూ జిల్లా 3వ మహాసభను అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయగలరని అదేవిదంగా నూతన లేబర్ కార్డుల జారీ, సహజ మరణానికి 5 లక్షలు,హెల్త్ కార్డులు ESI సౌకర్యం, అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్ రూములు, భవన నిర్మాణ కార్మికులకు ఆత్మీయ భరోసా,యాక్సిడెంట్ డెత్ 10 లక్షలు,థంబ్ సిస్టం రద్దు, డెలివరీ ప్రసూతి యాభై వేలు, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3000 పెన్షన్, ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News