నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్:
కొండారెడ్డిపల్లి గ్రామంలోని గుట్టపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ కానం ప్రేమ్ కుమార్ గౌడ్ భక్తులకు ఆహ్వానం పలికారు. “స్వామివారి కృప అందరికీ ఉండాలని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను” అని ఆయన తెలిపారు. ఈ మహోత్సవాల్లో భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులను పొందాలని ఆలయ కమిటీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తోంది.





