నేటి సాక్షి, వేమనపల్లి : నీల్వాయి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కోడూరి నేహస్విత నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయులు గిరిధర్ రెడ్డి బుధవారం తెలిపారు. నీల్వాయి పాఠశాల నుండి వరుసగా రెండవ సంవత్సరం విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక కావడం విశేషం. వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మెరిట్ విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం రూ. 12 వేలు ఇంటర్మీడియట్ వరకు పొందడం జరుగుతుందన్నారు. స్కాలర్ షిప్ కు సెలక్ట్ కావడంపై నేహస్విత అభినందనలు తెలిపారు.విద్యార్థి విజయం సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు.





