- పోస్టు కార్డులతో నిరసన
- విద్య పేరుతో పైసలు దండుకునే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డినీ ఒడగొడుతం
- బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ
నేటి సాక్షి, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలో బి ఆర్ ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని పోస్ట్ కార్డు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం లోకిరావడం కోసం అనేక హామీలు ఇచ్చి స్వయంగా రాహుల్ గాంధీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు స్కూటీలు ఇస్తానని అదేవిధంగా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు పదివేల రూపాయలు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15 వేల రూపాయలు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25 వేల రూపాయలు పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు 50వేల రూపాయలు విద్యా జ్యోతి పథకం కింద ఇస్తామని చెప్పిన తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తట్లేదని వారు చెప్పిన హామీలు అమలు చేయాలని రాహుల్ గాంధీ కి పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా విద్యావంతులు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యను వ్యాపారం చేసి నేడు రాజకీయం చేయబోతున్న ఊట్కూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని విద్యాసంస్థల పేరు ఆల్ఫోర్స్ బ్రాండ్ గా చేసుకుని ఊట్కూరి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, అని ప్రచారం చేస్తున్న ఎందుకు అధికారులు పట్టించుకోవడంలేదని వెంటనే నరేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థల పేర్లు ఎక్కడ వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అధికారులను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్ చాతల రంజిత్ ఒట్టే నాగదేవ్ పాల్గొనడం జరిగింది.





