Thursday, March 19, 2026

బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ పై దాడిని ఖండిస్తున్నాం

  • మాల మహానాడు ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షుడు మొయ్య రాంబాబు

నేటి సాక్షి, మందమర్రి:- బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు, 2024లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసిన దళిత నాయకుడైన మొయ్య వేణుగోపాలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షుడు మొయ్య రాంబాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడైన వేణు గోపాల్ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని, దళితులకు అవసరమైన అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించి, అంబేద్కర్ భవన నిర్మాణం స్థలం సేకరించినందుకు వేణుగోపాల్ పై భూ కబ్జాదారులు కక్షగట్టి, పట్టణంలోని కార్మెల్ పాఠశాల సమీపంలో మునీందర్ అనే వ్యక్తి అక్రమంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరచాడని తెలిపారు. వేణు గోపాల్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రెండెకరాల భూమి విషయమై కలెక్టర్ కు దరఖాస్తు ఇవ్వగా, అంబేద్కర్ కమిటీ హాల్ మంజూరు చేశారన్నారు. అక్కడ ఉన్న కొంతమంది దుండగులు వేణుగోపాల్ పై కక్ష పెంచుకొని, గొడవలు చేయ సాగారని, ఈ విషయమై గతంలో పోలీస్ స్టేషన్లో కేసులు సైతం నమోదయ్యాయని తెలిపారు. అదేవిధంగా 1994-95 సంవత్సరంలో ఎమ్మెల్యే కాలనీలో అప్పుడున్న ఎమ్మెల్యే బోడ జనార్దన్ టిడిపి ప్రభుత్వ హయాంలో పేదవారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగిందని, కొంతమంది దళారులు అవన్నీ నేలమట్టం చేస్తూ, 150 గజాల స్థలాన్ని ఒక్కొక్కరిగా కొంతమందికి అమ్ముకొని, కొంత భూమిని కబ్జా చేసుకుని భవంతులు కట్టారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి, 1994-95 సంవత్సరంలో అర్హుల జాబితా తీసి, విచారణ చేయాలని కోరారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న మొయ్య వేణుగోపాల్ పై దాడి చేసిన వారిని, అదేవిధంగా పట్టణంలో ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత రాజకీయ నాయకుడి పై అన్యాయంగా అక్రమంగా దాడి చేసి వారిని, అదేవిధంగా వారి వెనుక ఉండి నడిపిస్తున్న బీసీ నాయకుల పై సైతం పూర్తి విచారణ చేసి, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకం రవీందర్, జిల్లా నాయకులు పాత వీరాస్వామి, గంధం పున్నం, మామిడి క్రాంతి, రవి వర్మ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News