Thursday, March 19, 2026

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక

నేటిసాక్షి, రాయికల్ : ఈనెల 28 జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సదస్సుకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని కుమ్మరి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ బుధవారం తెలిపారు. “మన చుట్టూ ఉన్న ప్రపంచం లో విజ్ఞాన శాస్త్రం” అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధన పత్రాలు ఆహ్వానించగా జగిత్యాల జిల్లా నుండి అభయ్ రాజ్ రూపొందించిన పరిశోధన పత్రం ఎంపికయ్యింది, దాంతో ఈ నెల 28న రాష్ట్ర విద్యా శిక్షణా పరిశోధన సంస్థ నందు అభయ్రాజ్ రూపొందించిన “ప్రయోగశాలగా వంటశాల” పరిశోధన పత్రాన్ని తాను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, పీఆర్ టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రమేష్, మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, తదితరులు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News