Thursday, March 19, 2026

కుంభమేళాలో రెపరెపలాడిన గులాబీ జెండా

నేటి సాక్షి, మందమర్రి:- ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికేఎస్) నాయకులు కుంభమేళాలో గులాబీ జెండాను రెపరెపలాడించి, పార్టీపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా టిబిజికేఎస్ ఏరియా కార్యదర్శి ఒడ్నాల రాజన్న, కాసీపేట 2గని నాయకులు సారంగపాణి లు మాట్లాడుతూ, రాష్ట్రంలో అతి త్వరలో ఉపఎన్నికలు వచ్చి, బిఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి, మరల కేసిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని భగవంతుని కోరుకున్నారు. కేసీఆర్ లేని లోటు ప్రజలు తెలిసిందని, మార్పు కోరుకొని బాధపడుతున్నామని ప్రజలే అంటున్నారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడాది పాలనలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. కేసీఆర్ కోసం రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసీపేట గని పిట్ కార్యదర్శి బైరి శంకర్, నాయకులు పుప్పాల శ్రీనివాస్, శ్రీనివాస్, రాజేష్, హరీష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News