Thursday, March 19, 2026

పత్తి రైతుల కష్టాలు తొలగించాలి

  • బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు, జైపూర్ మండలాల పత్తి రైతులు మిల్లుల దగ్గర పత్తి బండ్లతో పడిగాపులు కాస్తున్నారని, వారి సమస్యను, కష్టాలను తొలగించాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కోరారు. మిల్లుల దగ్గర పత్తి రైతులు పడిగాపులు కాస్తున్న విషయాన్ని తెలుసుకొని, బుధవారం ఆయన నస్పూర్ లోని జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ ను కలిసి, వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా పత్తి రైతుల పడుతున్న అవస్థలను వారి దృష్టి తీసుకువెళ్లారు. స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ జిల్లా మార్కెటింగ్ ఎండి తో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని, రైతుల కష్టాలు తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు మంత్రి రామయ్య, మండల ఇంచార్జ్ కాసెట్టి నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News