- లక్ష్యంగా జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ పని చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి: కేంద్ర ప్రభుత్వ పథకం మిషన్ వాత్సల్య క్రింద బాలల సంక్షేమం మరియు వారి బాల్యానికి రక్షణ కల్పించుట లక్ష్యంగా జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులతో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ నందు: జిల్లా కలెక్టర్, చైర్ పర్సన్ గా, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, కమిషనర్ / చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అర్బన్ లోకల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కార్మిక అధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా క్రీడా అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ITDP), జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, జిల్లా ప్రణాళిక అధికారి , జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలలో భాగంగా 18 సం.ల లోపు బాలల సంక్షేమం మరియు సంరక్షణకు అన్ని చర్యలు గ్రామ స్థాయి వరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటుతో గ్రామాల్లో బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండేలా, పనికి వెళ్తున్న బాలకార్మికులు, బెగ్గింగ్ చేసే బాలలను గుర్తించి వారిని పని నుండి విముక్తి కల్పించి వారిని షెల్టర్ హోమ్స్ నందు నమోదు చేయించి వారికి బ్రిడ్జి ఎడ్యుకేషన్ అందేలా చూడాలని సూచించారు. అలాగే బిచ్చం ఎత్తుకునే బాలలను గుర్తించి వారిని అందుబాటులో ఉన్న షెల్టర్ హోమ్స్ నందు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా గ్రామాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. శిశుగృహ నందు సున్నా నుండి 6సం.ల లోపు పిల్లలను చేర్పించి వారికి సంరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అందుకొరకు శిశుగృహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఆఖరుకు పూర్తి చేయాలని అన్నారు. కమిటీ సభ్యులకు జువెనైల్ జస్టిస్ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని, తప్పి పోయిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెట్టీ వారిని సంరక్షణ కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది అని తెలిపారు. అత్యంత కీలకమైన కమిటీ ఇది అని, రాష్ర్ట స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారు ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. గ్రామ బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటుతో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమావేశమై 18 సం.ల బాలల భవిష్యత్తుకు తీసుకున్న చర్యలపై సమీక్షించుకోవాల్సి ఉంటుందని, అలాగే ప్రతి నెలలో ఒకసారి జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ సమావేశం కావాలని, సమీక్షించుకుని తీసుకున్న నిర్ణయాలు అమలుకు చర్యలు చేపట్టి బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారి సంక్షేమానికి అన్ని విభాగాధిపతులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి వసంత బాయి, మహిళా డి ఎస్ పి శ్రీ లత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాధం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ చిన్న లాలప్ప, జిల్లా ప్రణాళిక అధికారి ప్రేమ్ చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.





