Thursday, March 19, 2026

యువత సర్పంచ్ ఉద్యోగానికి సిద్దం అవ్వండి

  • ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే
  • పంచాయతీ ఎన్నికల గంట మోగనుంది.
  • బీసీ నాయకులు అచ్చనూరి కిషన్ ముదిరాజ్

నేటిసాక్షి /వాజేడు : తెలంగాణ రాష్టంలో స్థానిక ఎన్నికల సందర్బంగా యువత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయండి ఈ ఎన్నికలలో సర్పంచ్ ఉద్యోగానికి గ్రామం మొత్తంలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు వార్డు సభ్యులుగా కూడా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు. వీళ్లేనా అర్హులు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరూ రాజకీయ పార్టీలు పెట్టిన లేదా నిర్ణయించిన దరఖాస్తుదారులే. అవునాకాదా.(పార్టీ ల గుర్తులు ఉండవు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ సర్పంచ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ విధంగా వచ్చిన అభ్యర్థులు ప్రజల ఓట్లను డబ్బుతో, మద్యంతో కొనుక్కొని సర్పంచ్ ఉద్యోగాన్ని చేజెక్కించుకుంటున్నారు.
ఇలా ఉద్యోగాన్ని కొనుక్కునేవాడు లంచాలు తీసుకుంటూ. గ్రామాభివృద్ధి మరచి, అక్రమ సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతూ.ఊరు మీద తన పెత్తనం చేలాయిస్తూ, పేదవర్గాల ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు ఇదీ మన దేశంలో ఉన్న గ్రామ పంచాయతీ రాజకీయ నాయకుల దుర్మార్గపు వ్యవస్థ. అర్హత ఉండి, చదువుకొని జ్ఞానవంతులై ఉండి కూడా ఊరికి అన్యాయం జరుగుతుంటే ప్రత్యక్షంగా చూస్తూ కూడా యువకులు, జ్ఞానవంతులు ఈ సర్పంచ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం లేదు కారణం ఏమిటి రాజకీయాలు తెలియకా డబ్బు లేకపోవడమా తెలివితేటలు లేకపోవడమా ప్రజలను పరిపాలించే సత్తా, దమ్ము లేకపోవడమా ప్రజలకు నీతివంతమైన పరిపాలన అందించే సత్తా ధైర్యము ఉంటే సర్పంచి ఉద్యోగానికి ప్రతి గ్రామంలో పోటీ చేయండి. ఓడినా పర్వాలేదు మరోసారి గెలుస్తావు ఛలో అలోచించి అడుగు ముందుకు వేయండి ఆలస్యం చేయకండి. డిగ్రీలు, పిజి. లు, పోటీ పరీక్షలు రాయటానికి 10, 15, 20 సంవత్సరాలు దీక్షగా కూర్చొని పోటీపడ్డవాళ్ళు కేవలం ఒక్క గ్రామంలో 1000 నుండి 1500 ఓట్లు ఉన్న గ్రామంలో 750 ఓట్లకు పరీక్షలు రాయండి. కచ్చితంగా సర్పంచి ఉద్యోగం మనదే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువత మేల్కొవాలి.వార్డు సభ్యుల నుండి సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటిసి, కౌన్సిలర్, కార్పొరేటర్ ఉద్యోగాలు కైవసం చేసుకోవాలనీ బీసీ సీనియర్ రాజకీయ నాయకులు అచ్చనూరి కిషన్ యువతను కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News