Thursday, March 19, 2026

బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): బీఆర్ఎస్ నాయకులను గెలిపించుకునేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని మాన కొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం గన్నేరువరం మండల కేంద్రము లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో బ్రతుకుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈకార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న, మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్, రెడ్డి మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, మాజీ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, మీసాల ప్రభాకర్, బోయిని అంజయ్య, రవి పటేల్, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News