Friday, March 20, 2026

జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్..!

  • ఎస్పీ అఖిల్ మహాజన్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల (కోక్కుల వంశీ ) : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణను ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పర్యవేక్షించారు.

అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని అన్నారు. ఫైరింగ్ లోఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఈ శిక్షణలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, సిఐ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు,ఆర్ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News