- ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి ( సతీష్ ) : చందుర్తి మండలం సనుగుల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజుల స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.





