Friday, March 20, 2026

ఆర్బిట్ ఇ-టెక్నో పాఠశాలలో 14వ వార్షికోత్సవ (స్పందన్-2025) వేడుకలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని ఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఇ-టెక్నో పాఠశాలలో 14వ వార్షికోత్సవ వేడుకలు (స్పందన్-2025) ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి ల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జాయింట్ డైరెక్టర్ , ఇండియన్ పోలీస్ ఆఫీసర్ (ఐ.పి.ఎస్) వి.వి.లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఈవెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గౌరవ అతిథి గూడెల్లి శివ ప్రసాద్ (సైకాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ ఈసీజీ) మరియు హోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ చిట్టి రెడ్డి హారిక- భగవాన్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. ముఖ్య అతిథి వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి వివేకానంద స్వామిని, అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకొని, విద్యార్థులు భవిష్యత్తులో బంగారు బాటలు వేయాలని, తల్లిదండ్రులు మరియు గురువులు ఎక్కడ కలుస్తారో అక్కడ విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలాగా అవుతుందని చెప్పారు.

విద్యార్థులు వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని, విద్యార్థులు చదువు కున్న పాఠశాలకు వారే ముఖ్య అతిథిగా రావాలని, విద్యార్థుల యొక్క సంతకం భవిష్యత్తులో ఒక ఆటోగ్రాఫ్ గా మారాలని కోరారు. గౌరవ అతిథి గూడెల్లి శివ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో సెల్ ఫోన్ వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ది ఈవెంట్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పై తప్పని సరిగా శ్రద్ధ పెట్టి, భవిష్యత్తులో మంచి పేరు తీసుకు వచ్చేలా, చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండే విధంగా తయారు చేస్తామని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆర్బిట్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయటం లో  యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు కష్ట పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, స్పీచెస్, స్కిట్స్, పాటలు మరియు నృత్యాల ప్రదర్శన ద్వారా తల్లిదండ్రులను, పాఠశాల యాజమాన్యాన్ని పర్వ వశింపచేసేలా చేశారు. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఆర్బిట్ ఇ- టెక్నో పాఠశాల నిరంతరం శ్రమిస్తున్నందుకు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి డైరెక్టర్ సిహెచ్ హారిక రెడ్డి అకాడమిక్ ఇంచార్జ్ వాసుదేవ రెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మధుకర్, కళ్యాణి, సారంగపాణి, వహీదా బేగం, జావిద్ ఖాన్, షర్మిల, వెంకటేష్, రంజిత్, వినయ్ కుమార్, రాహుల్ రాజ్, ఇంద్రాణి,రాజ్ కుమార్, రూపా దేవి, శ్రీకాంత్, కృష్ణవేణి, శ్వేతా రెడ్డి, ప్రశాంత్, శ్వేత, ప్రవళిక, సాయి కళ్యాణ్, రజిత, రాధిక మరియు విద్యార్థిని, విద్యార్థులు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News