- వినతి పత్రం అందించిన ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ, స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీలోని జడ్పీ ఉన్నత పాఠశాలను గత వారంలో సందర్శించి పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్ను పెన్సిల్ రబ్బరు ఎరేజర్, నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు కొన్ని అత్యవసరమైనవి గుర్తించాము. ఈ మధ్య కురిసిన భారీ జడ్పీ హైస్కూల్ ప్రధాన ద్వారం గేటు వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోయి ప్రమాదకరంగా మారింది. అదేవిధంగా ఒక వైపు కాంపౌండ్ నిర్మాణం జరగలేదని తెలిపారు ఒక ప్రక్క ప్రహరీ గోడ లేకపోవడం వలన పాఠశాల ఆవరణలో పాములు తిరిగే అవకాశం ఉందని దీంతో విద్యార్థులు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు తమరు దయవుంచి ఆముదాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రధాన ద్వారం వద్ద బ్రిడ్జి నిర్మాణం, కాంపౌండ్ నిర్మాణం త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణం చేపట్టవలసిందిగా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ కుమార్, ఉపాధ్యక్షులు ఆనంబట్టు రాఘవేంద్ర, సీనియర్ నాయకులు చందు, జిల్లా సంయుక్త కార్యదర్శి మెదవాడ రాఘవ, బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్, గంగాధర్ నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు మహేష్. తదితరలు పాల్గొన్నారు.





