Friday, March 20, 2026

అడవిలో చెట్లు నరికిన వారిపై కేసు నమోదు

నేటి సాక్షి, వేమనపల్లి : అటవీ భూమిని ఆక్రమించేందుకు కాటేపల్లి అటవీ ప్రాంతంలో చెట్లు నరికిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని అటవీ క్షేత్రాధికారి జి.అప్పలకొండ బుధవారం తెలిపారు.ఈ అటవీ భూమిని కాటేపల్లి చెందిన మానేపల్లి రాజన్న S/o. లచ్చయ్య, మానేపల్లి నరేష్ , S/o. రాజన్న లు చెట్లను నరకడంతో అటవీ చట్టం 1967 ప్రకారం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించడం జరిగినదని తెలిపారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్ర అధికారి మాట్లాడుతూ కొత్తగా అటవీ భూమిని చదును చేయుటము, చెట్లను నరకడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొర్లపల్లి అటవి బీట్ అధికారి డి. స్వామి, సోమనపల్లి అటవీ సేక్షన్ అధికారి కె.స్వరూప పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News