నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : సమాజం లో నిత్యం జరిగే కుల అహంకార హత్యలను అరికట్టాలి అని దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం హసన్‌పర్తి మండల కేంద్రం లో నరేష్ మాట్లాడుతూ ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఒక ధళిత యువకుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి ని కుల ధురహంకర హత్య చేసిన దుండగులను కటినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో జరిగే కుల వివక్షతను, కుల ధురహంకార హత్యలను అరికట్టి, కులాంతర వివాహ జంటలకు రక్షణ కల్పించాలనీ కోరారు. అలాగే ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్ గ్రామంలో ధళిత యువకుడు శ్రీకాంత్ ను కులాంతర వివాహం చేసుకున్న కానిస్టేబుల్ ను తన తమ్ముడు అత్యంత ధారుణంగా హత్య చేసాడని గుర్తు చేసారు. వరుసగా జరుగుతున్న కుల ధురహంకార హత్యలను అరికట్టెందుకు, ప్రభుత్వం ప్రాణాలిక బద్ధంగా చర్యలు తీసుకోవాలనీ కోరారు.





