- నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చిత్తూరు జిల్లా కార్వేటి నగరo మండల కేంద్రంలోని సిఐ కార్యాలయం వద్ద సర్కిల్ పరిధిలోని పలు కేసుల్లో ఉన్న రౌడీషీటర్లతో పోలీసులు సమావేశం నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉన్న రౌడీ షీటర్లకు షీట్ లో పేర్లు తొలగింపుకు అవకాసం ఇస్తాం. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి నేరాలకు దూరంగా ఉండాలి అని హెచ్చరించిన నగరి డిఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీమ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నాటు సారా, గంజాయి, అక్రమ మద్యం విక్రాయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కార్యక్రమంలో కార్వేటినగరం సిఐ హనుమంతప్ప, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు రాజ్ కుమార్, సుమన్, వెంకటసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.





