నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కొక్కుల వంశీ) : వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ బుర్ర దశ గౌడ్ కు ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు దశ గౌడ్ ను పరామర్శించి ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సెస్ డైరక్టర్ హరిచరన్ రావు, మాజీ జడ్పీటీసీ మ్యకల రవి, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సీనియర్ నాయకులు కొండ కనకయ్య, మెరుగు శ్రీనివాస్ గౌడ్, ఇర్లపెల్లి రాజు, తిరుపతి తదితరులు ఉన్నారు.





