నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ అనుబంధం రిజిస్ట్రేషన్ నంబర్ 106 జోగులాంబ గద్వాల జిల్లా ఆధ్వర్యంలో బుధవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో జరిగిన మండల జనరల్ బాడీ లో టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు సి హనుమంతు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ మీకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం కొన్ని గ్రామాలలో చెక్కులు కొట్టినప్పటికీ ఈ కుబేర్లో పెండింగ్ చూపడం వలన కార్మికులకు వేతనాలు పడక గందరగోళం పడుతున్నారు. రాష్ట్రంలో పంచాయతీ వర్కర్లకు కొత్త సంవత్సరం నుంచి నెలకు 5వ తారీఖు లోపు వేతనాలను చెల్లిస్తానని చెప్పిన ప్రభుత్వ హామీని గాలికి వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదే మండలంలో కోదండపురం ధర్మారం మొదలగు గ్రామ వర్కర్లకు మూడు నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గ్రామపంచాయతీ వర్కర్స్ జీవో నెంబర్ 51 రద్దు చేస్తూ జీవో నెంబర్ 60 ని అమలు చేయాలని జీవో 60 ప్రకారం వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేయడం. కార్మికులు రాష్ట్రంలో జిల్లాల్లో మండల కేంద్రంలో గ్రామాల్లో ఉన్న పంచాయతీ వర్కర్లు ఐకమత్యంతో ప్రభుత్వాలను నిలదీస్తూ సమస్యల పరిష్కారం కోసం చైతన్యం కావాల్సిన అవసరము ఉందని సూచించడం జరిగింది. అనంతరం నూతన ఎర్రవల్లి మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ జనరల్ బాడీ తదానంతరం తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. కృష్ణ చంద్రాములు, మండల కమిటీ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఎంపీడీవో మండల ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తూ సీనియర్ అసిస్టెంట్ నాగరాజుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాబు ఉపాధ్యక్షులు శివయ్య బీచుపల్లి సహదేవుడు శివరాజు ఆంజనేయులు టవర్ హుస్సేన్ ఏసన్న బంగి నారాయణ, బిసన్న, ఆంజనేయులు, ప్రభు, దామోదరు, బీసన్న, మొదలగు వారు పాల్గొన్నారు.





