- సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం
- నడిగడ్డ ప్రాంతంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలని వినతి
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం తాగి పేద మధ్య బడుగు బలహీన వర్గాల ప్రజలు పిట్టల రాలిపోతున్నారని అన్నారు. గద్వాల్ జిల్లా కేంద్రంలో వైన్స్ షాపులలో పర్మిట్ రూములలో కనీస సౌకర్యాలు మరియు మంచినీటి సదుపాయాలు మరియు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. వాటికి తోడుగా జోగులాంబ గద్వాల జిల్లాలో లోకల్ మద్యం తయారు చేసి వైన్ షాపులకు మద్యాన్ని అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులలో తనిఖీలు చేసి నకిలీ మద్యాన్ని అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు జమ్మి చెడు, కార్తీక్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు హాలింపాష, బిరెల్లి దానయ్య, కోళ్ల అంజి, జమ్మిచెడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





