Friday, March 20, 2026

ఘనంగా ముగిసిన కొండాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 4

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో గోకర్ సాహెబ్ ఉర్సు సందర్భంగా నిర్వహించిన కే పీ ఎల్ – సీజన్- 4/, ఫిబ్రవరి 1వ తేదీ ప్రారంభమైన కొండాపురం ప్రీమియర్ లీగ్ సీజన్- 4 బుధవారం ముగిసింది. ఈ టోర్నలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి బుధవారం ఫైనల్ ఆర్ ఆర్ టీం డేంజర్ బాయ్స్ టీం హోరా హొరీగా తలపడగా ఆర్ ఆర్ జుట్టు మొదటి విజేతగా నిలిచింది. రెండవ విజేతగా డేంజర్ బాయ్స్ జుట్టు నిలించింది. విజయం సాధించిన జట్లకు శుభాకాంక్షలు తెలిపి విన్నర్ కప్ ను అందజేసిన యుగంధర్ నక్క రవి, ఆర్ ఆర్ కోచింగ్ సెంటర్ అనిమిరెడ్డి బహుమతులు అందజేశారు. బహుమతి దాతలు/మొదటి బహుమతి దాత : సావిటి కాడి గోవిందు రెడ్డి 8,000 అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆటలో గెలుపు ఓటమి లు సహజమని ఓడిపోయినా టీమ్స్ కు అభినందనలు తెలియజేసారు. భవిష్యత్తు లో కూడ క్రీడాలకు తనవంతు సహకారం ఉంటుందని తెలియజేసారు. ఎంతో చక్కగా నిర్వహించిన ఆర్గనైసార్స్ కు అభినందనాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, రవి, రంగారెడ్డి లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News