నేటి సాక్షి బ్యూరో, నిజామాబాద్, టి. ఎన్ రమేష్ : గురువారం రోజున, జాతీయ మాల మహానాడు, జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఆదేశానుసారం, నిజామాబాద్ నగరంలోని, సుభాష్ నగర్ లో గల, జాతీయ మాల మహానాడు కార్యాలయంలో, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు సక్కీ విజయ్ అధ్యక్షతన, నిజామాబాద్ జిల్లా స్థాయి జాతీయ మాల మహానాడు జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ మండలాలకు, అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రభంజన్ ను, జిల్లా అధికార ప్రతినిధిగా, మీడియా ఇన్ఛార్జిగా, నీరడి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాలలంత ఒకతాటిపైకి రావలసిన అవసరం ఉందన్నారు. కొందరు స్వార్ధపరులు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు, అన్నదమ్ముల లాంటి మాల మాదిగల మధ్య అగ్గి రాజేసి, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు, చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మాల సమాజ అభివృద్ధి కొరకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన మాల జాతికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సఖి విజయ్ మాట్లాడుతూ, విభజించు పాలించు అనే ధోరణిలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆయన ఫైర్ అయ్యారు. మాల సమాజం ఏకతాటి పైకి వచ్చి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి, అందరూ సంయమానంతో ముందుకెళ్లాలా నీ విజయ్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయ్, ఇరువురు నూతనంగా పదవులు పొందిన వారికి అక్నాలెడ్జ్మెంట్ పత్రాలను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి సఖి ప్రభంజన్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రెంజర్ల సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు తాటి రాజు, కోశాధికారి సంతోష్, న్యాయ సలహాదారులు సఖి గంగా కిషన్, జిల్లా అధికార ప్రతినిధి అండ్ మీడియా ఇంచార్జ్నీరడి రమేష్, గౌరవ సలహాదారులు నల్ల బాల్రాజ్, మండల అధ్యక్షులు: బేగరి శోభన్ నిజామాబాద్, రవీందర్ డిచ్పల్లి, ప్రసాద్ ఆలూరు, రాజేశ్వర్ డొంకేశ్వర్, రొడ్డ రవి జక్రంపల్లి, తలారి సతీష్, గోపాల్, దండు భూమయ్య కోటగిరి, సీమోన్ ధర్పల్లి, జిల్లా యువజన అధ్యక్షులు మగిడి దేవరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర విజయ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందూరు సునీత, నగర ప్రధాన కార్యదర్శి గైనీ విద్యాసాగర్, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.





