నేటిసాక్షి (కె గంగాధర్ ), పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రం లో స్థానిక సంస్థల 2 వ సాధారణ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ భాగంగా ఈరోజు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల మండల స్థాయి అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల తో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మండల పరిధిలో (13) ఎంపీటీసీ స్థానాలకు 68 పోలింగ్ స్టేషన్ యొక్క ముసాయిదా తుది జాబితా ప్రతిని ప్రదర్శించారు. ఈ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ విజయభాస్కర్, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు లోక మల్లారెడ్డి , సిపిఐ మండల అధ్యక్షులు ఇరుగురాళ్ల భూమేశ్వర్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు గంగుల కొమురెల్లి, బి ఎస్ పి పార్టీ మండల స్థాయి నాయకులు ఎన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.





