Friday, March 20, 2026

విద్యార్థులకు వ్యాస రచన ఉపన్యాస పోటీలు

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఆంగ్ల భాష దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సరోజినీనాయుడు జన్మదిన సందర్బంగా ఆమె ఫొటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. సరోజిని నాయుడు జీవిత చరిత్ర పై విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వేముల మధు, ఆంగ్ల ఉపాధ్యాయులు కొండూరి రజనీకాంత్, సిద్దె గంగారాజం, రాపర్తి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News