Friday, March 20, 2026

జిల్లాలో ఇసుక అవసరం ఉన్నవారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలి

  • దళారులను ఆశ్రయించవద్దు
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఈ విషయంలో ప్రజలకు ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చుఅని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.జిల్లా ప్రజల అవసరం మేరకు మన ఇసుక వాహనం ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయడం జరుగు తుందని, ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడు ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్ లు ఉన్నాయని, గృహ నిర్మాణాలు చేపడుతున్న జిల్లా ప్రజలకు మన ఇసుక వాహనం ద్వారా తక్కువ ధరకే ఇసుక ఇంటి వద్దకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే ఐ డి ఓ సి లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08545-233525 కు కాల్ చేసి తెలపవచ్చని చెప్పారు. నేరుగా వచ్చి సమస్య తెలియజేయాలనుకునేవారు ఐడిఓసి లోని రూమ్ నెంబర్ 115 కి వచ్చి తమ సమస్యలను తెలియజేసి సహాయం పొందవచ్చు అని చెప్పారు. ఉదయం ఆరు గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News