- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : జిల్లా ఆరోగ్యశాఖ సమావేశం మందిరం నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని అందరు వైద్యాధికారులను మరియు వైద్యాధికారిణిలను అన్ని ఆరోగ్య కార్యక్రమాల గురించి సమీక్షించడం జరిగింది, మిషన్ మధుమేహ కార్యక్రమంలో స్క్రీనింగ్ చేసిన ప్రతి ఒక్కరిని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని, గుర్తించిన అనుమానితుల నుండి రక్తనమూనాలు సేకరించి వారికి రోగ నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టాలని ఆ వివరాలన్నిటిని మిషన్ మధుమేహ సైట్ నందు అప్డేట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్సిడి కార్యక్రమం నందు ఫాలోఅప్స్ 100% చేయాలని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు జనరేట్ చేయాలని సూచించడం జరిగింది, సబ్ సెంటర్ స్థాయిలో ఈ సంజీవిని కాల్స్ మరియు టెలి మానస్ కాల్స్ ఇంప్రూవ్ చేయాలని మనకి ఆయన సూచించారు.జన ఆరోగ్య సమితి సమావేశాన్ని నిర్వహించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కు అవసరమైన వస్తువులను సమకూర్చుకొని వాటి వివరాలను జిల్లాకు సమర్పించాలని ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమంలో పోగ్రామ్ అధికారి డా.రాకేష్ రెడ్డి, జిల్లా ఎన్సిడీ కోఆర్డినేటర్లు మహేశ్వర చారి, శ్రీనివాస కొండ , జిల్లా డాటా మేనేజర్ లు వెంకట కృష్ణారెడ్డి, అశోక్ కుమార్ జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు.





