నేటి సాక్షి, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధలోని దాచారం గ్రామంలో శ్రీ శక్తి సోలార్ ప్రాజెక్టు గురించి అవగాహన చేయడానికి ఆ కంపెనీకి చెందిన మండల అభివృద్ది మేనేజర్ దొగ్గల ఉదయ్ కుమార్ రైతులకు సోలార్ ప్రాజెక్టు గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోలార్ మండల అభివృద్ధి మేనేజర్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగు భూమిని శ్రీ శక్తి సోలార్ కంపెనీకి లీజుకు ఇస్తే మా కంపెనీ మొత్తం పొలాన్ని పండించే కౌలు ఎకరానికి 33,000 రూ. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అంతేకాకుండా సంవత్సరం సంవత్సరానికి కొంత కౌలు పెంచే అవకాశం కూడా ఉందని, అంతేకాకుండా ఆ పొలం యజమానికి ఆ పొలాన్ని గమనించుకొని ఉన్నట్లయితే నెలకు కొంత జీతం గా చెల్లిస్తామని, ఆ యజమాని కొడుకులు కూతుర్లు గాని చదువుకొని ఉంటే వారికి ఆ కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తామని తెలిపారు. అయితే ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల వరకు శ్రీ శక్తి సోలార్ కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. బెజ్జంకి,గుగ్గిళ్ళ ,వడ్లుర్,బేగంపేట్,దాచారం ,తోటపల్లి,రేగులపల్లి,కల్లేపల్లి గ్రామాల రైతులు తమ భూమిని ఇవ్వాలనుకున్న రైతు 7207201437, 7416921063 గల ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరని దొగ్గల ఉదయ్ కుమార్ తెలిపారు.





