Friday, March 20, 2026

ఆరోగ్య సమస్యల తో “బాధపడుతున్న స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం”

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : రంగ సాయిపేట కమ్యూనిటీ హాల్ రుద్రమదేవి స్వచ్ఛంద సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్న స్త్రీలకు ఉచిత వైద్య శిబిరమును గౌరవ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం. సాయికుమార్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు ప్రారంభించడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబా మాట్లాడుతూ “సమాజంలో స్త్రీలు వివిధ రోగాలకు గురి అవుతుంటారు. ప్రధానంగా స్త్రీలు కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత లలో నిమగ్నమై వారి శరీరంలో జరిగే అనారోగ్య సమస్యలను త్వరగా గుర్తించక, సరియైన పౌష్టిక ఆహారము భుజించక వ్యాధులకు గురి అవుతున్నారు. ఎక్కువ మంది స్త్రీలు రక్తహీనత, మానసిక, సాంఘిక, ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగతంగా వారి ఆరోగ్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే స్త్రీలకు రక్తహీనత సమస్యలు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు మొదలగునవి వ్యాప్తి చెందుతున్నాయి. కావున ప్రతి స్త్రీ తన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, సామాజిక బాధ్యతతో జీవించాలని కోరినారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా వైద్య ఆరోగ్యశాఖ సేవలను విస్తృతం చేయాలని తెలిపినారు. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు మాట్లాడుతూ… గ్రామాలలో, మండలాలలో, పట్టణ ప్రాంతంలోని ఆరోగ్య సమస్యత్మక ప్రాంతాల ప్రజలను గుర్తించి , వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తున్నామని తెలిపినారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు , వివిధ శాఖ అధికారులు ఆరోగ్య శిబిరాలకు సహకరిస్తూ ప్రజలలో నిరంతరము ఆరోగ్య కార్యక్రమాలపై ఆరోగ్య విద్య బోధన చేయాలని కోరినారు. ప్రజలు కూడా వారి ఆరోగ్య సమస్యలకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా పరీక్షలు తగిన చికిత్సలు చేయించుకోవాలని తెలిపినారు. నేడు ఈ ఆరోగ్య శిబిరంలో 50 మంది పురుషులు, 61 మంది స్త్రీలు, 80 ల్యాబ్ పరీక్షలు మొత్తము 111 మందికి ఉచితంగా పరీక్షలు చేసి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన ఔషధాలు అందించడం జరిగినది అని తెలిపినారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ గారు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ గారు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.బి.సాంబశివ రావు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ డాక్టర్. మోహన్ సింగ్, సీ.ఐ వెంకటరత్నం ఎస్సై సురేష్, వైద్యాధి కారులు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, రుద్రమదేవి స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పొన్నం రాధిక, సి.బి.ఓ, ఈశ్వరయ్య ప్రోగ్రామ్ మేనేజర్, సభ్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News