Friday, March 20, 2026

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దాం

  • మంచిర్యాల సిఐ ప్రమోద్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల సిఐ ప్రమోద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నిర్వహించి యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ మనీషా రాథోడ్, కళాశాల ప్రిన్సిపల్ ఎండి సులేమాన్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల సిఐ మాట్లాడుతూ, బాలబాలికలు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, యువత తాము ఉన్న పరిసరాలలో ఇతరలు ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లయితే వెంటనే డ్రగ్స్ హెల్ప్ లైన్ నం. 14446 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, సామాజిక బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించి, యాంటీ డ్రగ్స్ సంబంధిత వివరణాత్మక వీడియోలను స్క్రీన్ పై ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రేఖ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ సందీప్, సంబంధిత అధికారులు, అధ్యాపక వర్గం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News