నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి కి చెందిన ప్రముఖ న్యాయవాది ముప్పారపు బాల కృష్ణమనాయుడు అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. తిరుపతి ఐదవ జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు మరియు ఫ్యామిలీ కోర్టులో వారు 3 ఏళ్ల పాటు అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సేవలు అందించనున్నారు. గతంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గాను మరియు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడరుగా పనిచేసి ప్రభుత్వం వద్ద రెండు పర్యాయములు. ఉత్తమ సేవా పతకం పొందారు. తెలుగుదేశం దేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులుగాను, తిరుపతి నగర లీగల్ సెల్ అధ్యక్షులు గా కూడా సేవలు అందించారు. ముప్పారపు బాలకృష్ణమనాయుడు సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం మరోసారి ఆయన్ను అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది.





