- ఆల్ ఇండియా రేడియోస్టేషన్ డెరైక్టర్ మహేష్
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు గురువారం కడప ఆల్ ఇండియా రేడియో ఇన్చార్జి స్టేషన్ డైరెక్టర్ చుండూరు మహేష్ భద్రకాళీ అమ్మవారిని,వీరభద్ర స్వామివారిని సందర్శించికొన్నారు. అర్చక స్వాములు స్టేషన్ డైరెక్టర్ మహేష్ ను ఖండువ పూలమాల తొ సన్మానించి తీర్చ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో వెంకటరమణారెడ్డి అర్చకులు కృష్ణయ్య స్వామి, యోగి స్వామి వీరభద్ర స్వామి మహత్యం గురించి ఆలయ చరిత్రను వివరించారు. ఈ నెల 23 నుంచి 11 రోజులు పాటు జరుగుతాయని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిoచడం జరుగుతుందని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు,ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలలో పాల్గొని భక్తిశ్రద్ధలతో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని సందర్శించుకుంటారని ఆలయ ఈవో వెంకటరమణారెడ్డి స్టేషన్ డైరెక్టర్ మహేష్ కు తెలియజేశారు. త్వరలో జరుగబోవు బ్రహ్మోత్సవాలకు ఆయనను ఆహ్వానించారు. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగు తీరును ఆల్ ఇండియా రేడియో కార్యక్రమముల ద్వారా శ్రోతలకు తెలియజేస్తామని స్టేషన్ డైరెక్టర్ మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. రేడియో అనౌన్సర్ రవికుమార్ రెడ్డి సమరసత సేవా ఫౌండేషన్ అన్నమయ్య జిల్లా సహసంస్కృతి ప్రముఖ్, రేడియో రంగస్థల కళాకారుడు తుమ్మల హరినాథ్ లు పాల్గొన్నారు.