- నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలి
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్


నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : ఎమ్మెల్యే ఎన్నికల్లో నా గెలుపులో ఏ విదంగా భాగస్వామ్యులు అయ్యారో అదేవిదంగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోనీ దువ్వాస్ బాంక్విట్ హాల్ లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేములవాడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ డా.వూట్కూరి నరేందర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సర కాలంలో జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ జరిగింది,మళ్ళీ గత పదేళ్లుగా డిఎస్సీ వేయలేదు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక డిఎస్సీ వేశామని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల లో 55 వేళ ఉద్యోగలు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది నెలల్లో 55 వేళ ఉద్యోగాలు ఇచ్చాము అని అన్నారు. మా ప్రభుత్వం కి ప్రతిపక్ష మాజీ సర్పంచ్ లు,ఎంపిటిసి లు కృతజ్ఞతలు చెబుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్‌గా భావించి రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఫైనల్ గా భావించాలని అన్నారు. ఎన్నికల్లో గ్రామాల్లోని పట్టభద్రులను ప్రసన్నం చేసుకొని ఎమ్మెల్సీ గెలుపు కోసం తోడ్పాటు అందిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఈజీగా ఉంటుందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ కింద పది కోట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అల్పోర్స్ నరేందర్ రెడ్డి విద్యాసంస్థల ద్వారా ఎంతమందికి సేవ చేస్తున్నారని, చాలామంది పేద ప్రజలకు పాఠశాల కళాశాలలో ఫీజుల విషయంలో రాయితీ కల్పించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి పరిపాలన కొనసాగుతుందని,ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని,రైతు భరోసా పై అపోహలు సృష్టించారు, కానీ నిన్నటి వరకే మూడు ఎకరాల వరకు పడ్డాయి, మిగతావి త్వరలోనే అర్హులైన వారికి రైతు భరోసా వస్తుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందజేయడమే లక్ష్యంగా నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వేములవాడ ప్రాంతమును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, కార్యకర్తలు కష్టపడండి,మీకు నేను అండగా ఉంటానని అన్నారు. రైతులకు వేసవికాలం రాకముందే సాగునీరు అందించాలని, రైతులు రోడ్ ఏక్కకముందే నీరు విడుదల చేయడం జరిగిందని, దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. వేములవాడ పట్టణ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేయాలని, నియోజకవర్గ పరిధిలోని అన్ని ఎంపీపీ,జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుందని అన్నారు.





