Friday, March 20, 2026

తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్ట్

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : దొంగతనం కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ.. గతంలో మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులలో నిందితుడైన భానోత్ శేషును ఈ రోజు అరెస్టు చేశామని అన్నారు. నిందితుడు కొంత కాలంగా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతుండగా,అతనిపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అని పేర్కొన్నారు.ఈ విషయంలో నిందితుడిని పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,మెట్‌పల్లి డిఎస్పి ఎ.రాములు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. నిందితుడు బీదర్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో మెట్‌పల్లి రెండవ ఎస్సై రాజు నాయక్, హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ రమణ,జలంధర్ లతో కూడిన ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి అతడిని అరెస్టు చేసి తీసుకు రావడం జరిగింది అన్నారు. పట్టుకున్న నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరిచిన్నట్లు తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని కోర్టులో హాజరు పరచడానికి కృషి చేసిన మెట్ పల్లి సిఐ. ఏ. నిరంజన్ రెడ్డి, మెట్ పల్లి పట్టణ ఎస్సై పి. కిరణ్ కుమార్, ఇబ్రహింపట్నం ఎస్సై ఏ. అనిల్, మల్లాపూర్ ఎస్సై కే.రాజు మరియు మెట్ పల్లి రెండవ ఎస్సై రాజు నాయక్ లను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డిఎస్పి ఏ రాములు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News