Friday, March 20, 2026

రాష్ట్రస్థాయి షాట్‌ పుట్‌ పోటీలకు తూం శివ చరణ్ ఎంపిక

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : ఇటీవల నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14, అండర్ 16 బాలురు, బాలికల అథ్లెటిక్ పోటీలు జిల్లాకేంద్రంలోని నాగారంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ నిర్వహించగా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శివ చరణ్ కమ్మర్ పల్లి మండలంలోని శ్రీ విద్యాసాయి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు, జిల్లా లో నిర్వహించిన అథ్లెటిక్స్ లో షాట్ పూట్ విభాగంలో అత్యంత ప్రతిభకనబర్చి జిల్లా మొదటి స్థానంలో నిలువడంతో పాటు అలాగే మిగితా విద్యార్థులు లాంగ్ జంప్ మరియు షాట్ పుట్ విభాగాల్లో మంచి ప్రతిభ తో ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో రెండవ స్థానంలో నిలవడం జరింగిందని, ఈ నెల 18,19 ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల చైర్మన్ ఏనుగు గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ విద్యా సాయి పాఠశాల చైర్మన్ ఏనుగు గంగారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థి శివ చరణ్ ను అభినందించారు. శివ చరణ్ రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడంతో తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కో ఆర్డినేటర్ జాను సుందర్, పవన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News