Friday, March 20, 2026

కిట్స్ వరంగల్ యన్ యస్ యస్ విద్యార్థి వడ్డెవరం సిద్ధార్థ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపిక

  • సాంస్కృతిక మరియు సంగీత రంగంలో జాతీయ స్థాయి ప్రశంసలు పొందినందుకు అభినందన

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కిట్స్ డబ్ల్యు యన్ యస్ యస్ విద్యార్థి వడ్డెవరం సిద్ధార్థ కు జాతీయ సమైక్యతా శిబిరము లో సాంస్కృతిక మరియు సంగీత రంగంలో ప్రశంసలు ఒక రికార్డ్ అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి సగర్వంగా తెలిపారు. కిట్స్ వరంగల్ యన్ యస్ యస్ క్లబ్ విద్యార్థి, వడ్డెవరం సిద్ధార్థ (తండ్రి వి. రంగయ్య) బి టెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ (సి ఎస్ ఈ) మూడవ సంవత్సరం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) నుండి సంగీతం & సాంస్కృతిక జాతీయ స్థాయి కార్యకలాపాల లో భాగంగా జాతీయ సమైక్యతా శిబిరాన్ని విజయ వంతంగా పూర్తి చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ వై యన్ కళాశాల (ఎ)లో జరిగింది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అన్నారు. దీనిని హైదరబాద్‌ లోని యన్ యస్ యస్ ప్రాంతీయ డైరెక్టరేట్, భారత ప్రభుత్వం ఆధ్వర్యం లోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 03-02-2025 నుండి 09-02-2025 వరకు 10 రోజుల పాటు విజయ వంతంగా నిర్వహించింది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) యన్ యస్ యస్ విద్యార్థి వి. సిద్ధార్థ 2025 జనవరి నెలలో కాకతీయ విశ్వ విద్యాలయం వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికలో జాతీయ స్తాయి కి ఎంపికయ్యారు మరియు ఈ శిబిరానికి హాజరైనందుకు మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి వి. సిద్ధార్థ ప్రాతినిధ్యం వహించారు. వి. సిద్ధార్థకు గొప్ప అవకాశం లభించింది మరియు జాతీయ స్థాయి ప్రశంసా పత్రం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ ఫార్మర్ ఎంపీ, కిట్స్‌ డబ్ల్యూ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీ కాంతరావు, కిట్స్ వరంగల్ యాజమాన్య సభ్యులు, కోశాధికారి పి. నారాయణరెడ్డి & హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే & కిట్స్‌డబ్ల్యు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) డైనమిక్ వాలంటీర్ యన్ యస్ యస్ విద్యార్థి సిద్దార్థను సాంస్కృతిక మరియు సంగీత రంగంలో జాతీయ స్థాయి ప్రశంసలు పొందినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్, ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, సి ఎస్ ఈ విభాగాధిపతి, ప్రొఫెసర్, డాక్టర్ పి నిరంజన్, కిట్స్ వరంగల్ యన్ యస్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్ & ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, డా. సిహెచ్. సతీష్ చంద్ర, అదనపు పి ఓ, యస్. భార్గవి, డీన్ విద్యార్థి వ్యవహారాలు, ప్రొఫెసర్ ఎం. శ్రీలత, అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు యం. నర్సింహారావు, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధి పతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పీ ఆర్ ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, అధ్యాపక సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు, యన్ యస్ యస్ క్లబ్‌కు చెందిన విద్యార్థి ప్రతినిధులు, క్లబ్ జి. మనోహర్ మరియు ఇతరులు సాంస్కృతిక మరియు సంగీత రంగంలో జాతీయ స్థాయి ప్రశంసలు పొందినందుకు ఆయనను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News