Friday, March 20, 2026

మహా శివరాత్రికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మహా శివరాత్రి పండగ పర్వదినం నేపథ్యంలో ఆలయాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఈనెల 26 వ తేది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేయాల్సిన ఏర్పాట్ల పై శుక్రవారం కలెక్టరేట్ లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని సమర్ధవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత చర్యలు చేపట్టాలని అన్నారు. వరంగల్ లోని ఆలయాల్లో దేవాదాయ శాఖ ద్వారా కాశీ విశ్వేశ్వరస్వామి, స్వయంభూ దేవాలయం, ఆకారపు బొమ్మలగుడి, దుర్గేశ్వరాలయం, భోగేశ్వసరాలయం తదితర ఆలయాల్లో ఆలయ సాంప్రదాయాల ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హెూమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్మెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సునీత, ఈఓ రత్నాకర్ రెడ్డి, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు, డి ఎం హెచ్ డాక్టర్ సాంబశివరావు, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈలు మహేందర్, శ్రీనివాస్ ఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఎస్ఐ చాంద్ పాషా పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News