Friday, March 20, 2026

అన్నదాత..! సుఖీభవ..!!

  • 1393 రోజులుగా పేదలకు అన్నదానం

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1393 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం పేదలకు, అన్నార్తులకు మరియూ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. శుక్రవారం అన్నదాతలుగా వేములవాడ వాస్తవ్యులు నాగుల రాజేశ్వర్ తేజస్విని దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నాగుల చంద్రశేఖర్, వొడ్యాల వేణు, ప్రతాప నటరాజు, పొలాస రాజేందర్, పసుల శ్రీనివాస్, సగ్గు రాహుల్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News