నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం లో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన్ బాబు ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ సుమలత అధ్యక్షతన అపోలో ఫార్మసీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సంస్ధ ప్రతినిథులు జగదీష్, శివశంకర్ రెడ్డి లు శుక్రవారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఎంపికలు నిర్వహించారు అందులో భాగంగా వ్రాత, మౌళిక పరీక్షలు నిర్వహించారు కళాశాల లో95 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నిరంజన్ బాబు తెలిపారు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ సంస్ధ ద్వారా వార్షిక వేతనం రూ 1.8 లక్షలు రూపాయలు అందజేసేందుకు కంపెనీ ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్నట్లు తెలిపారు అనంతరం ఎంపికైన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, బోధన సిబ్బంది అభినందనలు తెలిపారు.





