ఇకపై కఠిన చర్యలు తప్పవు సీఐ ఈ హరికృష్ణ
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలోని CP ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండ మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు ను సీజ్ చేయటం జరిగింది. విరాల్లోకి వెళితే ట్రాక్టర్ డ్రైవర్ లు అయిన రామంచ పరశురాం s/o రాజేందర్ r/o పోతిరెడ్డి పల్లి, వీణవంక, ఆకు అశోక్, s/o సారయ్య r/o కొరపల్లి, జమ్మికుంట, రామంచ నాగరాజు, s/o పోచయ్య, r/o విలాసాగర్, జమ్మికుంట పై కేసు నమోదు చేయటం జరిగిందని ఇకపై అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించిన యెడల కఠిన చర్యలు తప్పవని ఇసుక అక్రమ దారులకు సీఐ హరికృష్ణ పలు సూచనలు చేశారు.





