- ఫిబ్రవరి 16 నుండి 20 తేదీ వరకు కుల గణన రీ సర్వే
- బిసి నాయకుడు, 30 వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు): తప్పుల తడుకగా కులగణన సర్వే నివేదిక ఉందని, రాజకీయ, విద్యా, ఉద్యోగాలలో బిసి లకు అన్యాయం చేసే దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్రలు పన్నుతోందని బిసి నాయకుడు, 30 వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 గణాంకాల ప్రకారం తెలంగాణా జనాభా 3.50 కోట్లు ఉండగా, 14 యేళ్ల తర్వాత చేపట్టిన రేవంత్ సర్కార్‌లో చేపట్టిన కుల గణన సర్వే లో 3.54 కోట్లుగా చూపించారన్నారు. కేవలం నాలుగు లక్షలు మాత్రమే బీసీలు పెరిగినట్లుగా చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్వేలో 46.25 శాతం తగ్గించి చూపించారని ఆరోపించారు. ఈ డబ్ల్యుఎస్ ప్రకారం 10 శాతం కాపాడుకునే కుట్రలో భాగంగా సర్వే రిపోర్టును బయటపెట్టారని పేర్కొన్నారు. 2014లో 7 శాతం ఉన్న ఓసీ జనాభాను ప్రస్తుతం 15.79 శాతం పెంచి చూపించారన్నారు. సర్వే తప్పుల తడుక ప్రభుత్వం డొల్లతనానికి నిదర్శనమన్నా రు. బీసీలను పూర్తిగా అణగదొక్కే కుట్ర జరుగుతోంద న్నారు. బీసీ రిజర్వేషన్ పూర్తిగా గందరగోళం చేసే దిశగా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ తప్పుల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఈనెల ఫిబ్రవరి 16 వ తేది నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన రీ సర్వే నిర్వహించనున్నదని తెలిపారు. అధికారులకు సరైన సమాచారం ఇచ్చి అధికారులకు సహకరించాలని, అలాగే కులము, విద్య అర్హతలు, పిల్లలు, మొదలగు ఇతర అంశాల గురించి వారు అడిగిన విషయాలకు తగిన సమాచారం ఇచ్చి అధికారులకు సహకరించాలని, అలాగే సర్వే చేసే అధికారులు కూడా సర్వే చేసే ముందు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి సర్వే చేపట్టాలని ప్రజలకు, అధికారులకు విన్నవించుకున్నారు. ఒకవేళ సర్వే చేసే అధికారులు ఇంటి వద్దకు రాలేని పరిస్థితి ఉంటే వార్డు ప్రజలు మొన్నటి కుల గణన సర్వేలో పాల్గొనని వారు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మీయొక్క కుల గణన సర్వే సమాచారాన్ని అధికారులతో నమోదు చేయించుకోగలరని అన్నారు.
30వ వార్డు ప్రజలకు మరోక విన్నపం….
మొన్న జరిగిన ప్రజా పాలనలో అర్హులైన వారు కొత్త రేషన్ కార్డులు, అలాగే రేషన్ కార్డులో నూతన పేర్లు నమోదు చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్నవారు, మళ్లీ మీ సేవ కేంద్రాలలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం, పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు నమోదు చేసుకోవడానికి మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని, 30వ వార్డులో కుల గణనలో పాల్గొనని వారు సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించాలని విన్నవించారు.





