Friday, March 20, 2026

న్యాయమూర్తి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కొత్త గూడెం బార్ అసోసియేషన్

దాడికి సంఘీభావంగా విధులు బహిష్కరణ

నేటి సాక్షి, కొత్తగూడెం : రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తి పై జరిగిన దాడికి నిరసనగా వారికి సంఘీభావం తెలుపుతూ ఏకగ్రీవంగా కొత్తగూడెం అసోసియేషన్ విధులు బహిష్కరించింది .ఈ సంఘటను తీవ్రంగా ఖండించి ,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో సభాధ్యక్షులు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి ఎమ్. ఎస్. ఆర్.రవిచంద్ర లు మాట్లాడుతూ రంగారెడ్డిలో న్యాయమూర్తి పై జరిగిన దాడిని మొత్తం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తూ ఈ దాడిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ గా తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. దాడికి సంఘీభావంగా ఏకగ్రీవంగా సమావేశం తీర్మానం చేసి విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కటకం పుల్లయ్య మాట్లాడుతూ ఇలాంటి దాడులు సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుండా సామాన్య ప్రజలు బయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఏ కరుణాకర్, ఎస్ ప్రవీణ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు జలసూత్రం శివరాంప్రసాద్, జీవీకే మనోహర్ రావు, వివి సుధాకర్ రావు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, మల్లెల ఉషారాణి, మునిగడప వెంకటేశ్వర్లు, మారపాక రమేష్, కట్టుకోజ్వల నాగేశ్వరరావు ,ఎన్వి రాజేష్, మనుబోతుల సత్యనారాయణ, రావిరాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News