- విగ్రహ ప్రతిష్టాపన, ద్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైనారు
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ కృష్ణ దేవాలయం లో శ్రీ కృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు ద్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, ప్రత్యేక పూజలలో నిర్వహించి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డి ని శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, బీచుపల్లి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గట్టు రాజు, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





