- పోతులపల్లి వెంకటేష్ సాగర్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ప్రతిష్టాత్మకంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తలపెట్టిన సగర శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సగర సంఘం, యువజన, మహిళా సంఘం నాగర్ కర్నూల్ జిల్లా సగర సంఘం అందరికీ నా యొక్క అభినందనలు తెలంగాణ రాష్ట్ర సగర బంధువులను కోరుకునేది ఏమిటంటే మనము గత కొన్ని సంవత్సరాలుగా మన హక్కుల కొరకు పోరాడుతూనే ఉన్నాము. ఏ కులములో లేని ఐక్యత తో భగీరథ ప్రయత్నం చేసే సమయం ఆసన్నమైనది మనము మన శక్తి ఏమిటో నిరూపించుకోవాలంటే రాజకీయంగా ఎదగాలన్న భావితరాలు బాగుపడాలన్న మన డిమాండ్లను సాధించుకోవాలన్నా అతి ముఖ్యమైన వేదిక మన సగర శంఖారావం బహిరంగ సభ ను ప్రతి ఒక్క సగరుడు భగీరథ మహర్షిని శ్రీరాముని స్మరిస్తూ అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేద్దాం.





