నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన లెప్రసీ కేసుల పరిశీలనకు శనివారం రాష్ట్ర లెప్రసీ బృందం వస్తున్న సందర్భంగా, మండలంలోని అన్ని సస్పెక్టెడ్ కేసులను, పాత కేసులను, మందులు వాడుతున్న కేసులను పరిశీలించి, మందులు వాడే విధానం గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి అందరికీ అవగాహన కల్పించారు. అందరూ పాదరక్షలు ధరించాలి అందరూ కూడా లెప్రసీ గురించి అవగాహన కలిగి ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారితో పాటు మండల వైద్యాధికారులు డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి. రాజశేఖర్, సూపర్వైజర్లు శ్రీనివాస్, అలివేలు హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.





