Friday, March 20, 2026

జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి మండల విస్తృత స్థాయి సమావేశం

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం సూచన మేరకు చందుర్తి మండల అధ్యక్షులు అమర బండ ప్రసాద్ ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకుల మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం మాట్లాడుతూ.. బీసీలు నూటికి 60 శాతం ఉన్నత విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటా తమకు దక్కే వరకు పల్లె పల్లెన బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి బీసీల హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. మన పిల్లల భావితరాలు బాగుండాలంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం గ్రామ గ్రామాన బీసీ ఉద్యమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరగోని గోపి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బిల్లా వెంకట్ రాములు, జిల్లా మహిళా అధ్యక్షులు నాగారం కొమరవ్వ,జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, జిల్లా జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సబ్బు ఏలేందర్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బిల్లా వాణి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు కోడం రవి, వేములవాడ రూరల్ మండల అధ్యక్షురాలు పండుగ గంగా, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు బాధా పోషవ్వ, జిల్లా మహిళా కార్యదర్శి జక్కని త్రివేణి, చందుర్తి ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, ఉపాధ్యక్షులు హనుమయ్య చారి, కోశాధికారి తిప్పని శ్రీనివాస్,అధికార ప్రతినిధి మాట్కం మల్లేశం, మండల కార్యదర్శి బొరిగె ప్రసాద్, రుద్రంగి మండల అధ్యక్షులు మీసాల మల్లేష్ పటేల్, వీర్నపెళ్లి మండల అధ్యక్షులు పరమల మలేష్ యాదవ్, బోయిన్పల్లి మండల అధ్యక్షులు పెంచాల మహేష్, వివిధ గ్రామ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News